మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌తోపాటు.. జీవితరాజశేఖర్, హేమ కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ఫ్యానల్ సభ్యులను కూడా ప్రకటించారు. ఇండస్ట్రీలోని పెద్దలు తమకు నచ్చిన వారికి మద్దతు ప్రకటిస్తున్నారు.
మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ తన పదవిని విరమించారు. రెండేళ్లుగా అధ్యక్షుడ పదవిలో కోనసాగుతున్న ఆయన, తన కమిటీ విరమించిందని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను రెండేళ్లుగా మా అసోసియేషన్ కి స్వార్థం లేకుండా సేవలందించానని తెలిపారు.
అమ్మ(విజయ నిర్మల) ప్రతి నెలా ‘మా’కు 15 వేలు పంపించేవారు అని. ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజుకు వయస్సుకు తగ్గ డబ్బు పింపించే వారు అని తెలిపారు. వయసు 78 అయితే 78 వేలు ఇచ్చారు. కానీ అమ్మ మేం ఏ పదవిని కోరుకోలేదు. నేను ఇప్పుడు నెలకు 20 వేల చొప్పున మాకు విరాళంగా అందిస్తున్నాను. ఇది మా గొప్ప కోసం చెప్పడం లేదు. ఏ స్వార్థం లేకుండా చేసాం సేవలు. 20 ఏళ్లుగా నేనేమీ పదవులు అడగలేదు. ప్రెసిడెంట్ అవుతానని అనలేదు. దాసరి గారు.. జయసుధ గారు పిలిచి అడిగారు’ అని తెలిపారు.
ఇప్పుడు నా అధ్యక్షపదవికి విరమించడానికి కూడా రెడీగా ఉన్నాను. మావాళ్లు కూడా సిద్ధం అని సీనియర్ నరేష్ అన్నారు. నాగబాబు గారు నాకు మంచి మిత్రుల. ఆయన ఓ మాట అన్నారు. ‘మా’ నాలుగేళ్లుగా మసకబారింది అని అన్నారు. అలా అనడడం తప్పు.. మాతో నాలుగేళ్లుగా ఉన్నారు.. బైలాస్ ప్రకారం అలా అనకూడదు. అలా అనడం అనమాకు షాక్ అనిపించింది అన్నారు. ఇక ‘మా’అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళ ఏకగ్రీవానికి తన వంతు ప్రయత్నిస్తానని ‘సాక్షి’తో చెప్పారు. ‘మా’లో కులాలు, మతాలకు చోటు లేదని, లోకల్, నాన్ లోకల్ అనే అంశానికి చోటు లేదన్నారు. ఫోకస్‌గా పనిచేస్తూ, అందుబాటులో ఉన్నవారు అధ్యక్షుడిగా రావాలని నరేశ్ అన్నారు.