‘మా అసోసియేషన్’ అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు. మా అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై కొంత మంది సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం సబబుగా లేదన్న మానిక్… మా అసోసియేషన్ను చులకనగా చేసి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 29న జనలర్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆరోజునే ఎన్నికల తేదీ ఖరారు చేసే అవకాశ ఉంది. మంచు విష్ణును ఏకగ్రీవంగా మా ప్రెసిడెంట్ని చేస్తే బాగుంటుంది’ అని మా సభ్యుడు బాబు అభిప్రాయడ్డారు. 110 మంది సభ్యుల మద్దతు మంచు విష్ణుకు ఉందని మానిక్ తెలిపారు.