రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాలపై ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘మా బావ మనోభావాలు’ అనే సాంగును వదిలారు. హైదరాబాద్ .. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని ‘సంధ్య 35 MM’లో నిర్వహించిన ఈవెంట్ ద్వారా ఈ సాంగును రిలీజ్ చేశారు.
బాలకృష్ణ , చంద్రిక రవి, హనీరోజ్ బృందంపై ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్ ఆలపించారు. జానపద బాణీలో ఈ పాట హుషారుగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదలకానుంది.