సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసింది. ఈ చిత్ర విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మ.. మ.. మహేశా’ అనే మాస్ బీట్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు.
శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటలో మహేశ్, కీర్తి సురేశ్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవలే విడుదలైన మురారి వా, పెన్నీ వీడియో సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా జూన్ 23 నుంచి ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది ఆమెజాన్.