HomeTelugu Big Storiesరివ్యూ: లక్కున్నోడు

రివ్యూ: లక్కున్నోడు

నటీనటులు: మంచు విష్ణు, హన్సిక, ఎం.వి.వి.సత్యనారాయణ, జయప్రకాష్, తనికెళ్ళభరణి తదితరులు.. 
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
సంగీతం: అచ్చు-ప్రవీణ్ లక్కరాజు
చిత్రానువాదం-సంభాషణలు: డైమెండ్ రత్నబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రెడ్డి విజయ్ కుమార్
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్

‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో హిట్ అందుకున్న మంచు విష్ణు ఈసారి లక్కున్నోడు గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా విష్ణుకి ఎలాంటి రిజల్ట్ ను ఇచ్చింది.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ) అనే రౌడీ పాతిక కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేయగా అతడి దగ్గర పని చేసే మరో వ్యక్తి ఆ డబ్బు కొట్టేసి అదంతా తనదే అంటాడు. ఇది ఇలా ఉండగా.. లక్కీ(మంచు విష్ణు) తను పుట్టగానే వచ్చిందనుకున్న ఆస్తి మొత్తం పోతుంది. కొడుకు దురదృష్టం చూసి తనను లక్కీ అని పిలవడానికి కూడా ఇష్టపడడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలనుకున్న లక్కీ ఇంటర్వ్యూలో పద్మావతి(హన్సిక) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తన దురదృష్టం వలన ఉద్యోగం కూడా రాదు. కానీ మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ.. ఆ అమ్మాయి వెంట తిరుగుతూ ఉంటాడు. పద్మావతి కూడా లక్కీను ప్రేమిస్తుంది. తన కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని పిజ్జా డెలివరీ బాయ్ గా జాయిన్ అవుతాడు లక్కీ. తన చెల్లెలికి పెళ్లి కుదిరిందని తెలియడంతో పద్మావతితో కలిసి, వూరికి బయలుదేరతాడు.

కట్నం డబ్బు మగపెళ్ళి వారికి ఇవ్వడానికి వెళ్తాడు లక్కీ. పెళ్ళికొడుకు తండ్రికి మతిమరుపు ఉండడం వలన కట్నం డబ్బు ఇచ్చిన విషయాన్ని మర్చిపోతాడు. దీంతో లక్కీ కావాలనే డబ్బు ఇవ్వలేదని తన తండ్రి నమ్ముతాడు. మోసం చేసిన కొడుకుని దూరం పెడతాడు. ప్రేమించిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్లిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు లక్కీ. కానీ అదే సమయంలో తన దగ్గరకు పాతిక కోట్లు కొట్టేసిన వ్యక్తి ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చి ఆ బ్యాగ్ ఒకరోజు తన దగ్గర పెట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు. దీనికి లక్కీ కూడా సరే అంటాడు.

అసలు ఆ వ్యక్తి ఎవరు..? లక్కీకు దగ్గర డబ్బు దాయాలనుకోవడానికి కారణం ఏంటి..? ఆ బ్యాగ్ లో డబ్బుందని లక్కీకు తెలుస్తుందా..? చివరకు ఆ డబ్బు ఏమైంది..? లక్కీ కుటుంబ సభ్యులు, ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకుంటాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
రెగ్యులర్ రొటీన్ సినిమాలకు ఇప్పుడు కాలం చెల్లింది. కమర్షియల్ సినిమాలు కూడా కొత్తగా ప్రెజంట్ చేస్తేనే సినిమాలు ప్రేక్షకులు సినిమాలు చూస్తున్నారు. అలా కాదు మేము రొటీన్ గానే సినిమాలు చేసుకుంటాం అంటే రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయ్. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే.. ఓ చిన్న పాయింట్ ను తీసుకొని కథను మొత్తం నడిపించాలనుకున్నాడు దర్శకుడు. పోనీ కథనంలో కొత్తదనం ఉంటే అయినా.. సినిమా చూడొచ్చు. ఇక్కడ అదీ లేదు. పాత్రలను డిజైన్ చేసిన తీరు అలానే ఉంది.

విష్ణు పాత్రలో గానీ, హన్సిక పాత్రలో గానీ ఎలాంటి కొత్తదనం లేదు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. విష్ణు ఉన్నంతలో తన నటనతో ఓకే అనిపించాడు. హన్సిక గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అంత అందంగా కనిపించదు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ మాదిరి కేవలం పాటలు, లవ్ సీన్స్ కు పరిమితం అయింది. పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ ల కామెడీ పండింది. జయప్రకాష్, తనికెళ్ళ భరణిలు తమ పాత్రల పరిధుల్లో చక్కగా నటించారు. విలన్ గా ఎం.వి.వి.సత్యనారాయణ పర్వాలేదనిపించాడు.

టెక్నికల్ సినిమా స్టాండర్డ్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కథా, కథనాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. దర్శకత్వశాఖలో రాజ్ కిరణ్ నేర్చుకోవాల్సిన మెళుకువలు చాలానే ఉన్నాయి. సినిమాలో ఏ పాట గుర్తుపెట్టుకునే విధంగా ఉండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఏవరేజ్ గా ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే అనిపించింది. లక్కున్నోడు అని టైటిల్ చూసి సినిమా చూస్తే మన లక్ ఇంత బ్యాడా..? అని ప్రేక్షకులు ఫీల్  అవ్వడం ఖాయం!

రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu