మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరు మలయాళం లో సూపర్ హిటైన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆసినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను కొణిదెల ప్రొడక్షన్స్ నుండి రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా కథను మన తెలుగు నేటివిటీకి తగట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసే పని సుజీత్ కు అప్పగించాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త పిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి సుజీత్ కు హ్యాండ్ ఇవ్వనున్నట్లు ఈవార్తల సారశం. ఎందుకంటే.. ఇన్ని రోజులు కష్టపడి సుజీత్ చేసిన మార్పులు చిరుకు నచ్చలేదట! దానితో ఆ బాద్యతను మంచి అనుభవం ఉన్న దర్శకుడికి అపగించాలి అనుకుంటున్నారట. వి వి వినాయక్‌తో చేయాలనీ నిర్ణయించుకున్నారట. అయితే ఇంతకముంది వీరిద్దరి కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.