HomeTelugu Newsభారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు..

భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు..

8
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనమైన వేళ సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 162.50 మేర తగ్గింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో చమురు ధరలు పడిపోగా.. వరుసగా మూడో నెలలో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధరలు తగ్గాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 581.50కు తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్‌ ధర రూ. 150.50 తగ్గగా.. ఇప్పుడు రూ.162.50 మేర తగ్గింది. గత మూడు నెలల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ. 277 వరకు తగ్గిందని ఎల్పీజీ సంస్థలు తెలిపాయి.

తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ. 207 వరకు తగ్గనుంది. గత నెల రూ. 796.50గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్‌ ధర తాజా తగ్గింపుతోహైదరాబాద్‌లో రూ. 589.50కి చేరింది. తగ్గిన ధర ఇవాళ్టి నంచి అమల్లోకి వస్తుందని.. వచ్చే 15 రోజుల వరకు తగ్గిన ధర అమల్లో ఉంటుందని చమురు సంస్థలు ప్రకటించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu