మలయాళ నటి ప్రియా వారియర్ నటించిన ‘లవర్స్ డే’ సినిమా టీజర్ విడుదలైంది. రొమాంటిక్‌గా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు..’ అంటూ ప్రియా వారియర్, రోషన్‌ల మధ్య సాగే సన్నివేశాన్ని టీజర్‌లో చూపించారు. ఇద్దరి నటన చూడటానికి చక్కగా అనిపించింది. షాన్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.
‘లవర్స్ డే’ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ రహూఫ్ హీరోగా నటించారు. సుఖీభవ సినిమాస్ సంస్థ నిర్మించింది. ‘ఒరు అదార్ లవ్’ టైటిల్‌తో ఈ సినిమా మలయాళంలో విడుదల కాబోతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది ఈ సినిమాలోని ఓ పాట ప్రోమోను విడుదల చేశారు. అందులో ప్రియా వారియర్ కన్నుగీటిన తీరు అందర్నీ కట్టిపడేసింది. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమాను మలయాళంతోపాటు పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.