Bigg Boss 8 Telugu triangle love story:
Bigg Boss 8 Telugu తాజా ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, ప్రేరణ యశ్మి, విష్ణుప్రియపై విజయం సాధించి, ఫైనల్ మెగా చీఫ్ పోటీలోకి ప్రవేశించింది. ఈ పోటీ తర్వాత హౌస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
ఇదిలా ఉంటే, తాజా ఎపిసోడ్‌లో పృథ్వి, విష్ణుప్రియను మోసం చేయడం హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్సీ పోటీలో విష్ణుప్రియ, పృథ్వి మధ్య పెద్ద పోటీ జరిగింది. ఇందులో భాగంగా పృథ్వి, విష్ణుప్రియకు తప్పు తాళాన్ని ఇచ్చి మోసం చేశాడు.
అమాయకురాలైన విష్ణుప్రియ అది నిజమైన తాళం అని భావించి ఆటలో ముందుకు వెళ్లింది. చివరికి మోసపోయానని తెలుసుకుని, ఆమె చాలా నిరాశ చెందింది. మరో వైపు, బిగ్ బాస్ టేస్టీ తేజ, ప్రేరణను కాన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. హౌస్‌లో జరుగుతున్న కొన్ని గాసిప్ విషయాలు తెలుసుకోవడానికి వారిద్దరిని అడిగాడు.
ఇందులో తేజ, ప్రేరణ ఇద్దరూ యశ్మి, నిఖిల్ మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడారు. తేజ వివరించిన ప్రకారం, గౌతమ్ మొదట యశ్మి పట్ల ఆసక్తి చూపించగా, యశ్మి నిఖిల్ పట్ల ఇష్టం చూపించినట్టు చెప్పాడు. దీంతో గౌతమ్ కూడా తన ఫీలింగ్స్ బయటకి చెప్పలేదట. కానీ యశ్మి ఇంకా నిఖిల్ పట్ల స్పష్టత లేకుండా ఉంది.
ప్రేరణ చెప్పినట్లు నిఖిల్ యశ్మి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, ఏదో ఒక కారణం వల్ల తన భావాలను చెప్పడంలేదు. నిఖిల్ కొద్ది రోజుల క్రితం లవ్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నట్లు చర్చ సాగుతోంది. హౌస్‌లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
ALSO READ: Bigg Boss 8 Telugu లో ఒక్కసారిగా ఓటింగ్ తారు మారైపోయిందిగా!