HomeTelugu TrendingBigg Boss 8 Telugu లో అప్పుడే మొదలైపోయిన ప్రేమ కథ.. ఎక్కడి దాకా వెళ్తుంది?

Bigg Boss 8 Telugu లో అప్పుడే మొదలైపోయిన ప్రేమ కథ.. ఎక్కడి దాకా వెళ్తుంది?

New love story brewing in Bigg Boss 8 Telugu?
New love story brewing in Bigg Boss 8 Telugu?

Bigg Boss 8 Telugu Love Story:

బిగ్ బాస్ 8 తెలుగు అందరూ దృష్టిని ఆకర్షిస్తూ బాగానే ముందుకు వెళ్తోంది. ఈ రోజు నాగార్జున ఎపిసోడ్ రాబోతోంది. ఈ వారం ఎవరిని ఎలిమినేషన్ నుండి ఎవరు సేఫ్ జోన్ కి వెళ్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం బేబక్క హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బేబక్క, సోనియా సింగ్ లకు ఈ వారం చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ లక్కీగా సోనియా సేవ్ అయ్యి బేబక్క బిగ్బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేయబోతున్నారు. ఎలిమినేషన్ సంగతి పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ లో ఇప్పటికే చాలానే గొడవలు జరిగాయి. నిజానికి మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు ఒకళ్ళతో ఒకరు తెగ గొడవలు పడుతున్నారు.

ఇన్ని గొడవల్లో కూడా బిగ్బాస్ ఇంటిలో ఒక కొత్త ప్రేమ కథ మొదలవబోతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ మలియక్కల్, సోనియా సింగ్ మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరూ బాగా స్నేహంగా ఉంటున్నారు. ఎక్కువసేపు మాట్లాడుకుంటూ.. ఒకరితో ఒకరి ప్రవర్తన చూస్తూ ఉంటే.. వీళ్ళిద్దరి మధ్య లవ్ యాంగిల్ వస్తుందేమోనని బయట టాక్ నడుస్తుంది.

ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో వీరి ప్రేమాయణం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. గేమ్‌లో కూడా ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి. మొత్తం మీద, బిగ్ బాస్ 8 తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu