HomeTelugu Trending'క్యాబ్‌ స్టోరీస్‌' నుండి లవ్‌ రింగ్‌ టోన్‌ సాంగ్‌ రిలీజ్‌

‘క్యాబ్‌ స్టోరీస్‌’ నుండి లవ్‌ రింగ్‌ టోన్‌ సాంగ్‌ రిలీజ్‌

Love Ringtone Video Song f

‘స్పార్క్’ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను రానున్న చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. బిగ్‌బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. గిరిధర్, ప్రవీణ్, శ్రీహాన్, ధన్ రాజ్, నందిని, సిరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కె.వి.ఎన్ రాజేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తొలి భాగం మే 28న ‘స్పార్క్’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆసక్తిని కలిగించి. ఈ క్రమంలో తాజాగా ‘లవ్ రింగ్ టోన్’ అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

సాయి కార్తీక్ ఆలపించారు. ప్రేమలో మునిగి తేలుతున్న దివి – శ్రీహాన్ ల మధ్య ఈ పాట చిత్రీకరించబడింది. సుజాత సిద్ధార్థ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu