Homeతెలుగు News'మోడీకి జగన్‌ దొంగ పుత్రుడు.. పవన్‌ దత్త పుత్రుడు'

‘మోడీకి జగన్‌ దొంగ పుత్రుడు.. పవన్‌ దత్త పుత్రుడు’

8 3ఏపీ మంత్రి లోకేష్‌ ..ఎన్ని కష్టాలున్నా తిత్లీ బాధితులకు అండగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇవాళ మందసలో తిత్లీ బాధితులకు ఆయన నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్క జిల్లాలోనే పాదయాత్ర చేసిన జగన్ ఈ ప్రాంతానికి ఎందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. తుఫాన్ వచ్చిన వారంరోజులకు వచ్చి రెండు రౌండ్లు తిరిగి పవన్‌కల్యాణ్‌ వెళ్లిపోయారంటూ లోకేష్‌ ఎద్దేవా చేశారు. ఇంత నష్టం జరిగితే సాయం అందించేందుకు కేంద్రం ముందుకు రాలేదని.. దేశం మొత్తం విగ్రహాలు పెడతారుగానీ.. తిత్లీ బాధితులకు మాత్రం ఒక్కపైసా ఇవ్వరని మంత్రి లోకేష్‌ విమర్శించారు. మోడీకి జగన్‌ దొంగ పుత్రుడు.. పవన్‌ దత్త పుత్రుడు అని విమర్శించారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని పై పోరాడి తిత్లీ బాధితులకు అండగా నిలవాలని కోరారు. సీఎం చంద్రబాబు దీపావళి పండుగను తిత్లీ బాధితులతోనే కలిసి జరుపుకుంటారని చెప్పిన లోకేష్‌.. మందస మండలాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు లోకేష్‌ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu