భారత్‌లో లాక్‌డౌన్ మే 31 వరకు పొడిగించారు. మూడో విడత లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగియటంతో తదుపరి ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసుల మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉండాలని తెలిపింది.
మే 31 వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. కార్గో, మెడికల్ సేవలు, ఎయిర్ అంబులెన్స్, భద్రతకు సంబంధించిన, ఎంఏహెచ్‌కు సంబంధించిన వాటికి మాత్రం మినహాయింపు మెట్రో రైలు సేవలపై కొనసాగనున్న నిషేధం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి నిరాకరణ, హోం డెలివరీ ఇచ్చే రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉండే క్యాంటీన్లు తెరిచేందుకు అనుమతి సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర వినోద ప్రాంతాలపై నిషేధం కొనసాగుతుంది రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలపైనా నిషేధం కొనసాగింపు మతపరమైన సంస్థల్లోకి ప్రజలకు అనుమతి నిరాకరణ, మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేదు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలోగ్రీన్ రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమన్న కేంద్రం కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయన్న కేంద్రం
కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలకు అనుమతి లేదు, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి లేదు కంటైన్‌మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపై నిఘా, అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి. అత్యవసర సేవలు మినహా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందన్న కేంద్రం