HomeTelugu Newsమోడీ ఇచ్చిన ఏడు టాస్క్‌లు ఇవే..

మోడీ ఇచ్చిన ఏడు టాస్క్‌లు ఇవే..

2 14
కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగిసింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతారని తెలిసినప్పట్టి నుంచి ఆయన ఏం చెబుతారు? లాక్‌డౌన్ కొనసాగిస్తారా? ఎత్తివేస్తారా? లేక ఏదైనా సడలింపులు ఉంటాయా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇదే సమయంలో దేశంమొత్తం ఆయన ప్రసంగం కోసం ఆసక్తికగా ఎదురుచూసింది. అయితే, మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు ప్రధాని మోడీ… కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. లాక్‌డౌన్ కష్టాలు తట్టుకుంటూ ప్రతి ఒక్కరూ దేశాన్ని కాపాడుకుంటున్నారు అని మోడీ ప్రశంసించారు.21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం కట్టుదిట్టంగా అమలు చేసింది.. కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకేతాటిపై ఉంది అన్నారు.. మరో 19 రోజులు లాక్‌డౌన్ కొనసాగుతుందన్న ఆయన.. మొదట వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తాం.. అయితే, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్ పాక్షికంగా సడలింపు ఉంటుంది అన్నారు.

ఇక, కొత్త కేసులు క్రమంగా పెరగడాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.. అయితే మొదట చప్పట్లు.. ఆ తర్వాత దీపాలు వెలిగించడంపై టాస్క్‌లు ఇచ్చిన మోడీ.. లాక్‌డౌన్ పాటించడంపై ఇప్పుడు ఒకేసారి ఏడు టాస్క్‌లు ఇచ్చారు.. 1. సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలి 2. ఇంట్లో చేసిన మాస్క్‌లు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలి. 3. నిరుపేదలకు అండగా ఉండాలి. 4. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.. 5. ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను ఉపయోగించాలి. 6. కరోనాపై ముందుండి పోరాడుతున్న సిబ్బందిని గౌరవించాలి. 7. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి.. అంటూ ఏడు సూత్రాలు చెప్పుకొచ్చారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కూడా అప్పటి పరిస్థితులను సమీక్షించి సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు మోడీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu