దేవిశ్రీ ప్రసాద్.. క్లాసైనా, మాసైనా బిట్ ఏదైనా సరే.. తన మ్యూజిక్‌తో సంగీతాభిమానులను మ్యాజిక్ చేస్తారు మ్యూజికల్ సెన్సెషన్‌గా పేరు పొందారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇప్పటికే తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు ఆంథమ్’ ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. మనసును హత్తుకునేలా ఆంథమ్ ఉందని, దేవిశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశారంటూ నెటిజన్లు తెలిపారు. ఇదిలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ ఇంటి నుంచి మరో రాక్‌స్టార్ వచ్చేశాడు. మరెవరో కాదండి.. దేవిశ్రీ ప్రసాద్ మేనల్లుడు తనవ్ సత్య. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌ను హిట్ చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ దేవిశ్రీ ఓ
స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దేవిశ్రీ మేనల్లుడు తనవ్ ‘సరిలేరు నీకెవ్వరు’ పాటను ముద్దు ముద్దుగా పాడుతూ కనిపించారు. అంతేకాదండోయ్ పాటకు అనుగుణంగా పక్కనే ఉన్న టేబుల్‌పై కొడుతూ ఆ చిన్నారి మెప్పించాడు.
వీడియోను షేర్ చేసిన దేవిశ్రీ.. ”సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌ను పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా మేనల్లుడు తనవ్ సత్య ఈ పాటను తనకు తానుగా నేర్చుకుని నన్ను సర్‌ప్రైజ్ చేశాడు’ అని పేర్కొన్నారు. దేవిశ్రీ షేర్ చేసిన వీడియోపై స్పందించిన అనిల్ రావిపూడి.. ‘లిటిల్ రాక్‌స్టార్.. సూపర్’ అని పేర్కొన్నారు. మరోవైపు నెటిజన్లు సైతం.. ‘కోకో కోలా పెప్సీ మామా అల్లుడు సెక్సీ’, ‘మ్యూజిక్ మీ బ్లడ్‌లోనే ఉన్నట్టుంది అన్న’, ‘సూపర్ కిడ్ అన్నా’ అని రిప్లైలు ఇస్తున్నారు.