
Top 10 Highest Followed Celebs on Instagram:
ఇన్స్టాగ్రామ్ భారతీయ సెలబ్రిటీలపై ఎంత పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను అభిమానులతో కనెక్ట్ అవడానికి, తమ సినిమాలని ప్రమోట్ చేసుకోవడానికి సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ, ఇటీవల షారుక్ ఖాన్‌ను ఓవర్‌టేక్ చేసిన ఒక ఆశ్చర్యకరమైన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
టీవీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జుబేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్ ఖాన్‌ను దాటేసింది. జన్నత్‌కు ప్రస్తుతం 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, అయితే షారుక్ ఖాన్ 47.7 మిలియన్ల వద్ద నిలిచారు. ఇది జన్నత్ జుబేర్‌కి ఒక పెద్ద మైలురాయి అనడంలో సందేహం లేదు.
2025 జనవరి నాటికి, షారుక్ ఖాన్ లెజెండరీ స్టేటస్ ఉన్నా, ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 20 మోస్ట్ ఫాలోడ్ సెలబ్రిటీల జాబితాలో లేకపోవడం విశేషం. ప్రస్తుతం భారతదేశంలో విరాట్ కోహ్లీ 270 మిలియన్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నారు. Shraddha Kapoor (94.2M), Priyanka Chopra (92.6M) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 10 మోస్ట్ ఫాలోడ్ ఇండియన్ సెలబ్రిటీస్:
1. విరాట్ కోహ్లీ – 270M
2. శ్రద్ధ కపూర్ – 94.2M
3. ప్రియాంక చోప్రా – 92.6M
4. నరేంద్ర మోదీ – 92.4M
5. అలియా భట్ – 86.2M
6. కత్రినా కైఫ్ – 80.4M
7. దీపికా పదుకొనే – 80.4M
8. నేహా కక్కర్ – 78.4M
9. ఊర్వశి రౌతేలా – 72.6M
10. జాక్విలిన్ ఫెర్నాండెజ్ – 71.1M