HomeTelugu Big StoriesSummer 2025 లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న Tollywood హీరోలు వీళ్లే

Summer 2025 లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న Tollywood హీరోలు వీళ్లే

List of Summer 2025 Telugu Movie Releases
List of Summer 2025 Telugu Movie Releases

Tollywood releases in Summer 2025:

ఈ వేసవి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే చాలా మంది యంగ్ హీరోలు తమ కెరీర్‌ కోసం ఈ సమ్మర్‌లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరంతా మళ్లీ తమ మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కళ్యాణ్‌రామ్

‘బింబిసార’ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన కళ్యాణ్‌రామ్, తర్వాత ‘అమిగోస్’, ‘డెవిల్’ సినిమాలతో నిరాశపరిచారు. ఇప్పుడు ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వేసవి రేసులో ఉంది.

సిద్ధు జొన్నలగడ్డ

‘Tillu’ ఫ్రాంచైజ్‌ సినిమాలతో హిట్‌ల పరంపర అందుకున్న సిద్ధు జొన్నలగడ్డకు ఇప్పుడు ‘Jack’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో సిద్ధు మళ్లీ ప్రేక్షకుల మనసు దోచుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

నారా రోహిత్

దీర్ఘ విరామం తర్వాత నారా రోహిత్ ‘సుందరకాండ’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. అదనంగా, ‘భైరవం’ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వేసవి రేసులో ఉన్నాయి.

మంచు విష్ణు

దశాబ్ద కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు, ‘కన్నప్ప’ సినిమాతో వస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది.

శ్రీ విష్ణు

‘సమాజవరగమన’ హిట్ తర్వాత ‘ఒం భీమ్ బుష్’, ‘Swag’ సినిమాలతో నిరాశపరిచిన శ్రీ విష్ణు, ఈ వేసవిలో ‘Single’ అనే రొమాంటిక్ కామెడీతో రాబోతున్నారు.

విజయ్ దేవరకొండ

‘Liger’, ‘Family Star’ లాంటి సినిమాలతో ట్రోలింగ్‌కు గురైన విజయ్ దేవరకొండ, ఇప్పుడు ‘Kingdom’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో తన ఫామ్‌ను తిరిగి సాధించాలనుకుంటున్నారు.

నితిన్

‘భీష్మ’ తర్వాత నితిన్‌కు మళ్లీ హిట్ రావడం లేదు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ సినిమాలతో రాబోతున్న నితిన్ ఈ సినిమాలపై భారీ నమ్మకంతో ఉన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్

‘చత్రపతి’ హిందీ రీమేక్ పరాజయం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి వచ్చారు. ‘భైరవం’ సినిమాతో ఈ వేసవిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈ వేసవి టాలీవుడ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న నటుల కెరీర్‌ను నిర్ధారించనుంది. ఏ హీరో విజయం సాధిస్తాడో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu