HomeOTTఈ వారం OTT లో హడావిడి మామూలుగా లేదుగా!

ఈ వారం OTT లో హడావిడి మామూలుగా లేదుగా!

List of must-watch OTT releases this week
List of must-watch OTT releases this week

OTT releases this week:

ఈ వారం ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లు పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లు పెద్ద ఎత్తున కొత్త కంటెంట్‌ను విడుదల చేస్తున్నాయి.

RRR – Behind and Beyond

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక డాక్యుమెంటరీ “RRR – Behind and Beyond” డిసెంబర్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఇందులో సెట్స్‌పై జరిగిన ఆసక్తికరమైన విషయాలు ఉంటాయట.

Squid Game S2

నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి సీజన్‌ భారీ విజయాన్ని సాధించిన స్క్విడ్ గేమ్ సిరీస్ సెకండ్ సీజన్ డిసెంబర్ 26 నుండి ప్రీమియర్ అవుతుంది. ఈ సిరీస్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gladiator 2

ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డ్రామా “గ్లాడియేటర్”కు సీక్వెల్‌గా వచ్చిన “గ్లాడియేటర్ 2” థియేటర్లలో మంచి స్పందన పొందింది. ఇది డిసెంబర్ 25 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

Bhool Bhulaiyaa 3

హిందీ హర్రర్ కామెడీ ఫ్రాంచైజ్ భూల్ భులయ్యా 3 కూడా డిసెంబర్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Doctor Who: Joy To World

డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సిరీస్ డిసెంబర్ 25న విడుదల అవుతోంది. ముఖ్య పాత్రలో ఎన్‌క్యూటి గత్వా నటిస్తున్నారు.

Sorgavaasal

తమిళ చిత్రం సోర్గవాసల్ డిసెంబర్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో సామాజిక సమస్యలను అద్భుతంగా చూపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu