HomeTelugu Big Stories2025 లో విడుదల కాబోతున్న pan-Indian movies ఇవే!

2025 లో విడుదల కాబోతున్న pan-Indian movies ఇవే!

List of much-awaited pan-Indian movies in 2025!
List of much-awaited pan-Indian movies in 2025!

2025 Pan-Indian Movies:

ఈ 2025 సంవత్సరంలో పలు పాన్-ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ప్రతి భాషలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రాలు భారీ అంచనాలతో ఉన్నాయి. రామ్ చరణ్ నుంచి రజనీకాంత్, ప్రభాస్ నుంచి కమల్ హాసన్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు ఈ లిస్ట్‌లో ఉన్నారు.

Game Changer

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “గేమ్ ఛేంజర్” జనవరి 10న విడుదల అవుతుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.

Hari Hara Veera Mallu: Part 1

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన “హరి హర వీర మల్లు” సినిమాను వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పాన్-ఇండియన్ రిలీజ్‌గా వస్తుంది.

Coolie

సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “కూలీ” మే 1న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Thug Life

 

View this post on Instagram

 

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న “థగ్ లైఫ్” జూన్ 5న విడుదల అవుతుంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Sikandar

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన “సికందర్” ఈద్ పండగ సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సౌత్ భాషల్లో కూడా విడుదల కానుంది.

War 2

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన “వార్ 2” ఆగస్ట్ 14న రిలీజ్ అవుతుంది. ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Kantara 2

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతారా 2” అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.

Raja Saab

ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” చిత్రం దసరా సందర్భంగా విడుదల కానుంది. మొదట ఈ సినిమా వేసవిలో రావాల్సి ఉండగా, రిలీజ్‌ను వాయిదా వేశారు.

Akhanda 2

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న “అఖండ 2” దసరా స్పెషల్‌గా పాన్-ఇండియన్ మూవీగా విడుదల కానుంది.

Jaat

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న “జాట్” సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

Kubera

ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “కుబేర” సినిమా పాన్-ఇండియన్ రిలీజ్‌గా రాబోతుంది.

Indian 3

“ఇండియన్ 2” విఫలమైనప్పటికీ, కమల్ హాసన్, శంకర్ “ఇండియన్ 3” సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ALSO READ: చేతినిండా సినిమాలు.. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిన Mahesh Babu హీరోయిన్.. ఎందుకంటే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu