భారత్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో 170 జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించినట్లు ప్రకటించింది. లాక్‌డౌన్ కాలం పొడిగించినందున కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రత్యేక లేఖ రాశారు. హాట్‌స్పాట్ జిల్లాలతో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో 19 జిల్లాలు హాట్‌స్పాట్ జాబితాలో ఉన్నాయి. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను.. తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్ ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్ ప్రాంతాలను హాట్‌స్పాట్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను హాట్‌స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది.