Celebrity Restaurants in Hyderabad:
హైదరాబాద్ చరిత్రకి మాత్రమే కాదు ఆహారానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం. ఇక్కడ ఇప్పుడు సెలబ్రిటీలు ప్రారంభించిన రెస్టారెంట్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మరి మన హైదరాబాద్ లో Celebrity Restaurants ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
1. శర్వానంద్ – బీన్స్ కాఫీ షాప్ (జూబ్లీ హిల్స్)
తెలుగు వాళ్ళ ఫేవరెట్ స్నాక్స్ అరిటకాయ బజ్జి, పునుగులు, మిర్చి బజ్జి లాంటి వంటకాలతో ఈ కేఫ్ ఒక సరదా గడపడానికి మంచి ప్రదేశం.
2. సురేందర్ రెడ్డి – ఉలవచారు (జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి)
డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రారంభించిన ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకి కొత్త టేస్ట్ ఇచ్చింది. ఫ్యామిలీ డిన్నర్‌కి బాగా సరిపోతుంది.
3. శశాంక్ – మాయాబజార్ (కార్ఖానా, సికింద్రాబాద్)
ఈ రెస్టారెంట్ మాయాబజార్ సినిమా థీమ్‌తో ముఘాలై వంటకాల్ని అందిస్తుంది. ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఇది బెస్ట్.
4. ఎస్.ఎస్. కార్తికేయ – సర్క్యూట్ డ్రైవ్ ఇన్ (హైటెక్ సిటీ, వైట్‌ఫీల్డ్స్)
రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రారంభించిన ఈ డ్రైవ్ ఇన్ యువతకు బాగా నచ్చే ప్రదేశం.
5. మహేశ్ బాబు, నమ్రత – ఏఎన్ రెస్టారెంట్ (బంజారా హిల్స్, రోడ్డు నం. 12)
స్టైలిష్ ఇంటీరియర్స్ తో అన్ని రకాల క్యూజీన్స్ అందించే ఈ రెస్టారెంట్ సెలబ్రిటీల శ్రేణిలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
6. ఆనంద్ దేవరకొండ – గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ (మణికొండ)
కాఫీ, స్నాక్స్‌తో ఈ కేఫ్ స్నేహితులతో రిలాక్స్ అయ్యే మంచి ప్రదేశం.
7. దగ్గుబాటి ఫ్యామిలీ – సాంక్చువరీ (జూబ్లీ హిల్స్)
దగ్గుబాటి కుటుంబం చిన్ననాటి గృహాన్ని రెస్టారెంట్‌గా మార్చారు. ఇక్కడ వడ్డించే ఇటాలియన్ వంటకాలు ప్రత్యేక ఆకర్షణ.
8. నాగార్జున – ఎన్ గ్రిల్ & ఎన్ ఏషియన్ (జూబ్లీ హిల్స్)
ఇండియన్, ఇటాలియన్, మిడిల్ ఈస్ట్రన్ వంటకాలతో ప్రత్యేకమైన వేడుకలకి ఇదో మంచి ఆప్షన్.
9. నాగచైతన్య – షోయు (జూబ్లీ హిల్స్)
ఆసియా వంటకాలతో షోయు రెస్టారెంట్ డిమ్ సమ్స్, సుషీ ప్రియులకి మంచి ప్రదేశం.
క్రికెట్ స్టార్ల రెస్టారెంట్లు:
10. విరాట్ కోహ్లి – వన్ 8 కమ్యూన్ (హైటెక్ సిటీ):
ముంబై, ఢిల్లీలో ఫేమస్ అయిన ఈ రెస్టారెంట్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
11. అంబటి రాయుడు – బ్యారక్స్ & ఆంటర్‌రూమ్ (సైనిక్ పురి):
View this post on Instagram
మూడు అంతస్తులతో ఉండే ఈ రెస్టారెంట్ పార్టీలు, గ్యాథరింగ్స్‌కు పర్ఫెక్ట్.
ALSO READ: SSMB29 సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసే బాలీవుడ్ తార ఎవరంటే!