
Liquor Ban in Hyderabad:
సైబరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు మూడు రోజులు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు బార్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు.
గ్రాడ్యుయేట్స్, టీచర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఎన్నికల నియమాల ప్రకారం, పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం అమ్మకాన్ని నిషేధించాలి. దీంతో కొల్లూరు, ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులు, రెస్టారెంట్ల బార్లు మూసివేయనున్నారు.
ఎన్నికల వివరాలు
ఎప్పుడు? ఫిబ్రవరి 27, 2025 (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
మెదక్-నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాలు, వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్ నియోజకవర్గాలు
ఓట్ల లెక్కింపు: మార్చి 3, 2025
ఈ మూడు రోజులు మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశం లేదు. హోటళ్లలో బార్ సేవలు అందుబాటులో ఉండవు. కనుక ముందుగా మీ అవసరాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ ఆంక్షలు ఎన్నికల నిబంధనల ప్రకారమే అమలవుతున్నాయి.