క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘కడలల్లె వేచె కనులే..’ అన్న పాటతో విజయ్ దేవరకొండ ఫైటింగ్ సన్నివేశాలతో టీజర్ మొదలైంది. వర్షంలో విజయ్, రష్మిక ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశంతో టీజర్ ముగిసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.