HomeTelugu Big Storiesచిరంజీవి, సల్మాన్‌తో 'లైగర్‌' టీమ్‌ ఫొటో వైరల్‌

చిరంజీవి, సల్మాన్‌తో ‘లైగర్‌’ టీమ్‌ ఫొటో వైరల్‌

Liger teen with Chiranjeevi

డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం మూవీ ‘లైగర్’ ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్. స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 25న విడుదల కానుంది.

‘లైగర్’ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు ‘అకిడి పక్డి’ – ‘వాట్ లగా దేంగే’ పాటలు మంచి స్పందన తెచ్చుకొని.. సినిమాపై హైప్ పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్న VD అండ్ టీమ్.. ఆదివారం ముంబై లోని ఒక మాల్ లో సందడి చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘గాడ్ ఫాదర్’ సెట్ ను చిత్ర బృందం సందర్శించింది.

‘గాడ్ ఫాదర్’ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లపై ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ టీమ్ తమ సినిమా కోసం ఇద్దరు స్టార్‌ హీరోల ఆశీస్సులు తీసుకున్నారు. స్టార్స్ ఇద్దరూ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ – సూపర్ స్టార్ లతో ‘లైగర్’ మీట్ కు సంబంధించిన ఫొటోని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరు, సల్మాన్, పూరీ, ఛార్మీ, విజయ్‌ దేవరకొండ కనిపిస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పూరీ జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu