HomeTelugu Trending'లైగర్‌' టీమ్‌ ఫొటో వైరల్‌

‘లైగర్‌’ టీమ్‌ ఫొటో వైరల్‌

liger team photo with mike

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే హీరో, హీరోయిన్‌లు గా నటిస్తున్న చిత్రం ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్‌లో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఓ కీలక పాత్ర కోసం మైక్‌ టైసన్‌ని సంప్రదించి ఒప్పించింది చిత్రబృందం. తాజాగా యూఎస్‌ షెడ్యూల్‌లో భాగంగా చిత్ర బృందంలో మైక్‌టైసన్‌ వచ్చి చేరారు.

ఈ సందర్భంగా టైసన్‌తో దిగిన ఫొటోల‌ను షేర్‌ చేసింది చిత్ర బృందం. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు పూరీ జ‌గ‌న్నాథ్‌, అన‌న్య పాండే, ఛార్మిల‌తో మైక్ టైస‌న్ చిల్ అవుతున్నారు. అంత‌క‌ముందు విజ‌య్.. మైక్ టైస‌న్‌తో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. మైక్‌ అంటే ప్రేమకు నిర్వచనం. ఆయనతో ఉన్న ప్రతీ క్షణం గుర్తుండిపోయేలా చేసుకుంటున్నా. అందులో ఇది ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. లైగర్‌ వర్సెస్‌ లెజెండ్‌ మొదలైంది అంటూ ఓ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. అజయ్‌కు జంటగా అనన్యపాండే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu