రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. నిన్న (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో, ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ప్రతికూల రివ్యూల కారణంగా చివరికి నెమ్మదించింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘లైగర్’ మొదటి రోజు దాదాపు రూ. 20-25 కోట్లు రాబట్టినట్లు అంచనా. మరోవైపు ‘లైగర్’ హిందీ వెర్షన్ విడుదల కాస్త ఆలస్యమైంది. ఇందుకు గల కారణాలు ఏమిటో తెలియలేదు. నెగెటివ్ రివ్యూలు వస్తున్న నేపథ్యంలో ‘లైగర్’ ఈ వారాంతంలో ఎలా నడుస్తుందనే దానిపై సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాను చిత్రబృందం జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించడంతో అన్ని భాషల్లో భారీగా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ వచ్చాయి. ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్‌ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది.