HomeTelugu Trending100 మిలియన్ క్లబ్ లో చేరిన 'లైఫ్ ఆఫ్ రామ్' సాంగ్‌

100 మిలియన్ క్లబ్ లో చేరిన ‘లైఫ్ ఆఫ్ రామ్’ సాంగ్‌

Life of ram song in 100 m
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన చిత్రం ‘జాను’. ఈ సినిమాలో కాస్త వయసు మీద పడిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రామచంద్ర పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ‘లైఫ్ ఆఫ్ రామ్’ పాటను సూపర్ హిట్ అయింది. ఆదిత్య మ్యూజిక్ ఛానెల్ ద్వారా విడుదల చేయబడిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి అరుదైన ఘనత సాధించింది.

ప్రేక్షకులలో శర్వానంద్ కు ఉన్న ఆదరణ ‘జాను’ చిత్రంలోని ఈ పాటను క్లాసిక్ గా మార్చిందని చెప్పవచ్చు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సింగర్ ప్రదీప్ కుమార్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్ సమకూర్చిన ట్యూన్ శ్రోతలను వెంటాడేలా చేసింది. ఇప్పుడు ఈ పాట మైలురాయి 100 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జాను’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu