తమిళ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లియో’. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్ గట్రా సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి. పైగా విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. బిజినెస్ లెక్కలు సైతం రెండొందల కోట్ల పైనే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పాన్ ఇండియా మూవీ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాపై ఒక లెవల్లో బిజినెస్ జరగుతుంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం టాలీవుడ్ ట్రేడ్‌నే ఆశ్చర్యపరిచింది. పైగా పోటీగా భగవంత్ కేసరీ, టైగర్ నాగేశ్వరరావు వంటి భారీ సినిమాలు ఉండగా ఆ రేటు పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి. తమిళనాడులో సైతం ఈ సినిమా కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్‌లు తెగ పోటీ పడుతున్నారట.