HomeTelugu Big Storiesలియో: సంజయ్‌ దత్‌ స్పెషల్‌ మీడియా

లియో: సంజయ్‌ దత్‌ స్పెషల్‌ మీడియా

leo movie special video rel
తమిళ నటుడు విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘లియో’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వస్తున్న వస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య రిలీజైన ప్రోమో నుంచి మొన్న విడుదలైన నా రెడీ సాంగ్‌ వరకు ప్రతీది వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేస్తున్నాయి. ఇప్పటికే టాకీ పార్ట్‌ మొత్తం కంప్లీట్‌ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్‌ ఓ అదిరిపోయో వీడియోను రిలీజ్‌ చేసింది.

ఈ రోజు శనివారం సంజయ్‌ దత్‌ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో సంజయ్‌ ఆంటోని దాస్‌గా కనిపించనున్నాడు. విజయ్‌ను ఢీ కొట్టే స్టైలిష్ విలన్‌గా సంజయ్‌ రోల్ ఉండబోతున్నట్లు లోకేష్‌ ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు. ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం వేరే లెవల్లో ఉంది. లిటరల్లీ గూస్‌బంప్స్‌ తెప్పించాయి. అంతేకాకుండా లియోలో సంజయ్‌ పాత్ర విజయ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని చెన్నై వర్గాల టాక్‌. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాను సెవన్ స్క్రీన్‌ స్టూడియో నిర్మించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!