Legal outcomes of Allu Arjun Case:
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. చిక్కడపల్లి పోలీసులు ఇవాళ మూడు గంటలపాటు అల్లు అర్జున్‌ను విచారించారు. ఈ విచారణలో నటుడి లాయర్ అశోక్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే పోలీసులు మళ్లీ ఆయనను విచారణకు పిలవవచ్చు అని సమాచారం.
కేసు ఇంత వరకు విచారణలో ముందుకు సాగినప్పటికీ, పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నారు. లీగల్ నిపుణుల ప్రకారం, ఇది సాధారణ పరిణామమని చెప్పవచ్చు. “బెయిల్ రద్దు పిటిషన్ రెండు రకాలుగా వేయవచ్చు – ఒకటి నిందితుడు విచారణకు సహకరించకపోవడం లేదా బాధితులను, సాక్షులను ప్రభావితం చేయడం. అల్లు అర్జున్ ప్రెస్ మీట్, అల్లు అరవింద్ ట్రస్ట్ ప్రకటనలను పోలీసులు కోర్టులో ఉపయోగించవచ్చు,” అని లాయర్ తెలిపారు.
Actor Allu Arjun appears before Chikkadapally police regarding Sandhya theatre stampede cases.
He was arrested earlier and is on interim
bail.
Bail condition says he should cooperate with investigation.#Hyderabad #AlluArjunArrest pic.twitter.com/RKbWNRbJ2i— Sudhakar Udumula (@sudhakarudumula) December 24, 2024
అలాగే, “ఇవాళ విచారణకు హాజరుకావడం చాలా కీలకం. హాజరు కాకపోతే, అది విచారణకు సహకరించకపోవడం అని భావిస్తారు. ఇప్పుడు, పోలీసుల నివేదికలో ఆయన సమాధానాలను ఎలా అభివర్ణిస్తారో చూడాలి. సాక్ష్యాల ఆధారంగా కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది,” అని పోలీసులు చెబుతున్నారు.
ఇక ప్రభుత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఈ కేసులో కీలకంగా మారవచ్చు. పోలీసుల చర్యలు, ప్రభుత్వ స్పందనపై పరిశ్రమ పెద్దలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, కేసు పరిష్కారానికి పరిశ్రమ పెద్దలు చర్చలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ: టాలివుడ్ నుండి మీడియేటర్లు Revanth Reddy ని కలవనున్నారా?