లెబనాన్ దేశం రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 100 మందికిపైగా చనిపోయారు, 4 వేల మందికి పైగా గాయపడ్డారు. బీరూట్‌లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగింది. అయితే అక్కడి ఓ గోదాంలో ఆరేళ్లుగా భద్రత చర్యలు లేకుండా విధ్వంసక పదార్థాలు అయిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయడం దీనికి కారణం అని తెలుస్తుంది. ఈ పేలుడుకు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోంది. ఈ పేలుడు తీవ్రత ఎంత ఉందంటే దాని శబ్దం 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వినిపించింది. ఈ ప్రమాదంలో 2 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. అయితే ఈ ఘటన పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ట్విట్టర్ లో ఈ విషయానికి సంబంధించి ఓ ట్విట్ చేశారు. అందులో ”లెబనాన్ పేలుడు వినాశనాన్ని చూడటం ఖచ్చితంగా భయంకరమైనది. ఈ దురదృష్టకర సంఘటనతో బాధపడుతున్న. ఘటన బాధితుల కోసం మరియు వారి కుటుంబాల కోసం నేను ప్రార్థనలు చేస్తున్నాను” అని తెలిపారు. కాగా ఈ ఘటనపై రకుల్, తమన్నా కూడా స్పందించారు.
Absolutely horrifying to see the devastation in the #BeirutExplosion. My prayers for all the people and their families affected by this unfortunate incident.
— Mahesh Babu (@urstrulyMahesh) August 5, 2020