రాఘవ లారెన్స్ .. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా ప్రతీ విభాగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని అయిన లారెన్స్… ఆయనను పొగిడేస్తూ.. మరో టాప్ హీరో కమల్ హాసన్‌పై చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు హాజరైన లారెన్స్… తను రజనీకాంత్‌కు ఎంతో వీరాభిమానినే చెప్పుకుంటూ.. చిన్నతనం నుంచి తాను రజనీ సార్ అభిమాని.. చిన్నప్పుడు గోడ మీద కమల్ సార్ పోస్టర్ కనిపిస్తే ఆవుపేడ తీసి కొట్టేవాడ్ని అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరూ చేయి.. చేయి కలుపుకొని నడుస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు లారెన్స్.
అసలు వివాదం ఇక్కడే మొదలైంది… లారెన్స్ స్పీచ్ మొత్తాన్ని వదిలిపెట్టిన ఫ్యాన్స్… పేడ స్పీచ్ వరకూ వీడియో క్లిప్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.. దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో లారెన్స్‌పై ఫైర్ అవుతున్నారు. ఇక, చేసేది ఏమీ లేక తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు లారెన్స్… దీనిపై సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను తిట్టేముందు, విమర్శలు చేసేముందు ఆ వీడియో మొత్తం చూడాలని సూచించిన లారెన్స్. చిన్నతనంలో చేసిన పని చెప్పాను.. కానీ, నాకు కమల్ సార్ అంటే ఎంతో గౌరవం అన్నారు. కమల్‌పై తనకు ఉన్న గౌరవాన్ని, ప్రేమను నిరూపించుకోవాల్సినా అవసరం లేదన్న లారెన్స్… మీ అనుమానం తీరకపోతే ఆ వీడియోను పూర్తిగా చూడాలని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. మరి ఈ వివరణతోనైనా లోకనాయకుడి ఫ్యాన్స్ కూల్ అవుతారేమో చూడాలి మరి.