మెగాప్రీన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ కు, ‘గని’ మూవీ యూనిట్కి విషెస్ చెప్పింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. మామూలుగా అయితే ఇందులో పెద్దంత ప్రత్యేక ఏమీ లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనే పుకారు షికారు చేస్తోంది. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్లో ఇచ్చిన ఈ బ్యూటీ .. వరుణ్ తేజ్ కు జంటగా తొలిసారి ‘మిస్టర్’ మూవీలో నటించింది. ‘గని’ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి అదే సినిమాకు కో-డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పటి ఆ పరిచయమే ఇప్పుడు ‘గని’ తో అతను డైరెక్టర్ కావడానికి కారణమైంది. అయితే ‘మిస్టర్’ చిత్రం పరాజయం పాలైనా, ఆ తర్వాత ‘అంతరిక్షం’ మూవీలో మరోసారి వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది లావణ్య త్రిపాఠి.
ఇక ఆమెకు మెగా ఫ్యామిలీ హీరోలతోనూ బాగానే సాన్నిహిత్యం ఉంది. రేపు ‘గని’ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ను లావణ్య ‘ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. మీ బృందం చేసిన హార్డ్ వర్క్ కు తగిన ప్రతిఫలం ప్రేక్షకుల నుండి లభించాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రత్యేకంగా విషెస్ చెప్పడం మరోసారి టాలీవుడ్ లో మరోసారి వైరల్గా మారిపోయింది.
Wishing @IAmVarunTej and the team #Ghani all the very best for tomorrow, you gave your 110 % to this role, and i pray that you & your team’s hard work will be rewarded by our incredible audience! 🍀 #GhaniFromApril8th pic.twitter.com/KVeYNUn3H7
— LAVANYA (@Itslavanya) April 7, 2022