HomeTelugu Trendingఅవి చూస్తే... తెలియకుండానే భయం కలుగుతుంది: లావణ్య

అవి చూస్తే… తెలియకుండానే భయం కలుగుతుంది: లావణ్య

Lavanya tripathi suffering

లావణ్య త్రిపాఠి ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనను నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తను ఆహ్లదకరమైన జీవితాన్ని చూస్తున్నానని, కాంక్రిట్‌ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఒత్తిపరమైన ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు చెప్పింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ప్రస్తుతం కొత్త కథలు వింటూ ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పింది. ‘మనం సంతోషంగా లేనప్పుడు ఇతరులకు కూడా ఎలాంటి ఆనందాన్ని పంచలేము. ఈ సిద్దాంతాన్ని నేను బాగా నమ్ముతాను. మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనేది అప్పుడప్పుడు తరచి చూసుకోవడం ముఖ్యం.

స్వీయ విశ్లేషణ వలనే నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సక్రమంగా సాగుతుంది. నాకు ట్రిపోఫోబియా ఉంది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే నాలో భయం కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తను నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా పేర్కొంది. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు రాబోతున్నానని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu