తమిళనాడులో లావణ్య అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది అక్కడి ఉన్నత న్యాయస్థానం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. లావణ్య హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హ్యాష్‌ట్యాగ్ వాడుతున్నారు. ఓ నెటిజన్ సదరు హీరోయిన్‌ను చులకన చేసి మాట్లాడాడు. ‘లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత అమ్మాయి. లావణ్య త్రిపాఠి ఒక చౌకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఆమెను ఆ హీరోయిన్‌తో పోల్చకండి’ అని దురుసుగా మాట్లాడాడు.
తనపై పరుష వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌పై హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఘాటుగా కౌంటరిచ్చింది. ‘నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్‌గా మాట్లాడతారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు. ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో! ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే!’ అని ట్వీట్‌తో గట్టి కౌంటరిచ్చింది.
Why do men like you start respecting women when something horrible happens, before that they call them cheap.. Learn to respect everyone!
Extremely unfortunate incident, but this is the reality of our society. https://t.co/nGVshvWeCk— LAVANYA (@Itslavanya) January 31, 2022