Mega family: ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్లు పెళ్లికి ముందు వరకు ఎలాంటి పాత్రలైనా చెయ్యడానికి అయిన రెడీగా ఉంటారు. పెళ్లి తర్వాత మాత్రం ట్రెడిషనల్ పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటారు. కొంతమంది అయితే పూర్తిగా నటనకే దూరమవుతారు.
టాలీవుడ్‌లో మూవీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల్లోకి కోడళ్లుగా వెళ్ళిన వాళ్ళు కూడా నటనకు దూరమైన ఉదాహరణలు ఉన్నాయి. ఈక్రమంలో మెగా కోడలి లావణ్య త్రిపాఠి నటన కొనసాగిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
పెళ్లి తర్వాత కూడా లావణ్య నటనకు ఏమీ దూరం కాలేదు. తాజాగా మిస్ పర్ఫెక్ట్ పేరుతో ఒక వెబ్ సిరీస్ లో నటించింది. మరి ఎలాంటి పాత్రలు చేయాలనే విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా కండిషన్లు పెట్టారా అనే ప్రశ్న లావణ్యకు ప్రమోషనల్ ప్రెస్ మీట్లో ఎదురైంది.
దీనికి బదులిస్తూ లావణ్య.. పెళ్లికి ముందు కూడా తనకు తన కుటుంబంలో ఎవరు కండిషన్లు పెట్టలేదని.. తనను స్వేచ్ఛగా వదిలేశారని.. తాను తన పరిమితుల్లో నచ్చిన పాత్రలు చేశానని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా వరుణ్ ఫ్యామిలీ నుంచి తనకు ఎలాంటి కండిషన్లు లేవని ఆమె తెలిపింది. కానీ మెగా ఫ్యామిలీ కోడలిగా తన లిమిటేషన్లు ఏంటో తనకు తెలుసని లావణ్య చెప్పింది.
లావణ్య త్రిపాఠి, మెగా కోడలు.. ఈ రెండు ట్యాగ్స్ లో ఏది ఇష్టమని అడిగితే తనకు తానుగా గుర్తింపు తెచ్చుకున్నది లావణ్య త్రిపాఠినే కాబట్టి ముందు అదే ఇష్టమని.. అదే సమయంలో మెగా కోడలు అని ట్యాగ్ తనకి ఎంతో స్పెషల్ అని ఆమె వెల్లడించింది. భర్తగా వరుణ్ తేజ్ ఎన్నో విషయాల్లో బెస్ట్ అని.. తనకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తాడని లావణ్య పేర్కొంది.