‘మత్తు వదలారా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రితేష్ రానా కొత్త సినిమాను ప్రారంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో జరిగిన పూజతో ఈ మూవీ ప్రారంభం అయింది. ఎస్‌ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు.
గుణ్ణం గంగరాజు కెమెరా స్విచాన్ చేశారు. రాజమౌళి, కొరటాల శివతో పాటు మైత్రి అధినేతలు నవీన్, రవి, చెర్రీ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. మైత్రీ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చెర్రీ,హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ చిత్రానికి అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ గానుఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబాసాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాల సుబ్రమణ్యం కె.వి.వి వ్యవహరించనున్నారు.