Lavanya Tripathi: మెగా కోడలు ఉపాసన కొణిదెల గత కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రాంలో ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్‌ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్‌ల గురించి పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అంజనమ్మ, సురేఖమ్మలు అత్తమ్మాస్ కిచెన్ కోసం ప్రొడక్టులను తయారు చేస్తూ ఉంటే.. వాటిని వీడియోలు తీసి, వారితో ఫన్నీగా ముచ్చట్లు పెడుతూ.. ఆ ప్రొడక్ట్‌లను ఎంత హైజీనిక్‌గా తయారు చేస్తున్నారో చూపిస్తూ వచ్చారు. అలా అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్‌లను బాగానే ప్రమోట్ చేశారు.
అయితే తాజాగా అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టా పేజ్‌లో వచ్చిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో లావణ్య త్రిపాఠి, నాగబాబు సతీమణి పద్మ కనిపించారు. వారు ఆవకాయ్‌ను తయారు చేస్తూ కనిపించారు. ఆవకాయ్‌ను కలుపుతూ పోజులు ఇచ్చిన ఫోటో పై నెటిజన్లు మండిపడుతున్నారు. అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్‌ల నాణ్యత మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అలా జుట్టుని వదిలేశారు.. చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఏ మాత్రం హైజీన్ మెయింటైన్ చేయడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ టీం ఇన్ స్టాలో స్పందించింది. అలా కామెంట్లు చేసిన వారికి రిప్లైలు ఇచ్చింది. అది అమ్మడానికి కోసం చేస్తున్న ఆవకాయ్ కాదు.. ఇంటి కోసం చేసింది కాబట్టి.. వాళ్లు అలా కనిపించారు.. అత్తమ్మాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజిన్ మెయింటైన్ చేస్తారని క్లారిటీగా చెప్పారు.
ఇలా అత్తమ్మాస్ కిచెన్ పేజీలో పోస్ట్ పెట్టి.. స్టాక్ లిమిటెడ్ అని చెబితే.. అందరూ అలానే అనుకుంటారు కదా? అని నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే హైజీనిక్గానే ప్రొడక్ట్‌లను తయారు చేస్తున్నామని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.
కాగా నాగబాబు భార్య పద్మపై మాత్రం ప్రశంసలు చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా.. పిఠాపురంలో మీవంతు సాయం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లావణ్య పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న టైమ్‌లో పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడం వదిలేసి.. ఇవి అవసరమా అంటూ.. ట్రోల్ చేశారు.