
Tesla Cars Launch in India:
టెస్లా అంటే కార్ లవర్స్‌కి ఒక స్పెషల్ క్రేజ్. ఎలక్ట్రిక్ వాహనాల్లో టెస్లా ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. చివరికి, భారత మార్కెట్లోకి కూడా టెస్లా రాబోతోంది! ఏప్రిల్ 2025 నుంచి న్యూఢిల్లీ ఏరోసిటీ, ముంబై BKC లో టెస్లా షోరూమ్‌లు ప్రారంభించనుంది. అయితే, ఇవి సేవా కేంద్రాలు (సర్వీస్ సెంటర్స్) కాదు, కేవలం రిటైల్ షోరూమ్‌లు మాత్రమే అని కంపెనీ స్పష్టంగా చెప్పింది.
టెస్లా 2022లోనే ఇండియా మార్కెట్‌లోకి రావాలని ప్లాన్ చేసుకుంది. కానీ అధిక దిగుమతి సుంకాలు, రూల్స్ & రెగ్యులేషన్లు, EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపం వంటి సమస్యల వల్ల ఆలస్యమైంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ విధానాలు EVలకు అనుకూలంగా మారడంతో, కంపెనీ తక్కువ టైమ్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది.
టెస్లా కార్ల ధర భారత మార్కెట్‌కు కీలకం కానుంది. ప్రారంభ ధర ₹21 లక్షలు ($25,000) నుండి ఉంటుంది. మోడల్ 3 ₹60 లక్షలు, మోడల్ X ₹2 కోట్లు వరకు ఉండొచ్చు. అయితే, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
టెస్లా కార్లలో అత్యాధునిక టెక్నాలజీ ఉంటుంది. ఆటోపైలట్, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మినిమలిస్ట్ ఇంటీరియర్ వంటి ఫీచర్స్ వాహన ప్రేమికులను ఆకట్టుకుంటాయి. మోడల్ 3 పెర్ఫార్మెన్స్ కేవలం 2.9 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకోవడం విశేషం. ఇంకా, బిగ్ టచ్‌స్క్రీన్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, HEPA ఫిల్టర్లతో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకర్షణగా నిలుస్తాయి.
ఇండియాలో EV రంగం వేగంగా మారుతోంది. ప్రధాన మంత్రి మోదీ-ఎలాన్ మస్క్ సమావేశం, ప్రభుత్వ విధానాలు, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపు లాంటి అంశాలు టెస్లా భవిష్యత్తుకు సహాయపడతాయి. టెస్లా ఇప్పటికే కస్టమర్ సర్వీస్, స్టోర్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలను ప్రకటించింది.
మొత్తంగా, భారత మార్కెట్‌లో టెస్లాకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ, అధిక ధరలు, లిమిటెడ్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయినప్పటికీ, టెస్లా రాకను భారత EV ప్రియులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు!