
SSMB29 shooting update:
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా మూవీ SSMB29 షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. ఇటీవల కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకున్న ఈ సినిమా, ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ను రీస్టార్ట్ చేసింది.
ఇంతకీ బ్రేక్ ఎందుకు తీసుకున్నారంటే…?
ఈ సినిమా లీడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన తమ్ముడి పెళ్లికి హాజరయ్యేందుకు ముంబయి వెళ్లడంతో, టీం రెండు వారాల పాటు షూటింగ్‌ను విరామం ఇచ్చింది. అయితే షూటింగ్ మళ్లీ మొదలైందనుకునేలోపే మరో షాకింగ్ బ్రేక్ వచ్చింది. దర్శకుడు రాజమౌళి కుటుంబ సభ్యుడు మరణించడంతో, సినిమా షూటింగ్ అనుకోకుండా ఆగిపోయింది.
అయితే, ఇప్పుడు షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు, రాజమౌళి త్వరలోనే మీడియాతో సమావేశమై SSMB29 అప్‌డేట్స్ గురించి తెలియజేయనున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో సినిమాకు సంబంధించిన కొన్ని క్రేజీ డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ యాక్షన్, అదిరిపోయే విజువల్స్, కొత్త కథ – ఇలా అన్నీ కలిపి ఈ మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి. మరి మహేష్-రాజమౌళి కాంబినేషన్ ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
ALSO READ: Pushpa 2 వల్ల ఇన్ని కోట్ల నష్టమా బాబోయ్