
Latest OTT releases in Hindi:
ఓటీటీలో తాజాగా రిలీజైన Kaushaljis vs Kaushal అనే ఫ్యామిలీ డ్రామా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ నటుడు అశుతోష్ రాణా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, తండ్రీకొడుకుల మధ్య తరం తేడాలపై ఆసక్తికరంగా సాగుతుంది. జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన కథను అందించడానికి ప్రయత్నించింది.
సినిమాలో పావైల్ గులాటి, శీబా చద్దా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. కథలో తండ్రీ కొడుకుల మధ్య తేడాలు, వారి జీవితాల్లో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి. పావైల్ గులాటి తన తండ్రి ఆలోచనలతో విభేదిస్తూ, తన జీవితాన్ని ఎలా మార్చుకుంటాడో ఈ కథ చూపిస్తుంది. ముఖ్యంగా అశుతోష్ రాణా, శీబా చద్దా పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కథాకథనం పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, భావోద్వేగాలు ప్రధానంగా నడిపించే ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. పావైల్ గులాటి, ఇషా తల్వార్ లవ్ ట్రాక్ బాగా పని చేయకపోయినా, కుటుంబ భావోద్వేగాలను ఎలివేట్ చేసే కొన్ని సన్నివేశాలు బాగా కుదిరాయి. సినిమా టెక్నికల్‌గా చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ కలిగిస్తుంది. కానీ స్క్రిప్ట్ ఇంకా బలంగా ఉంటే సినిమాకు మరింత అండగా ఉండేది.
ఈ సినిమా హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలుస్తుంది. ముఖ్యంగా అశుతోష్ రాణా, శీబా చద్దా లాంటి నటి నటుల పెర్ఫార్మెన్స్ సినిమాని ఓసారి చూడదగ్గదిగా మార్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా ఈ సినిమాను చూస్తే కనెక్ట్ అవ్వగల అవకాశముంది.
ALSO READ: Comedian Kapil Sharma ఒక్క ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా