Latest Hit Movies: 2024 జనవరి సంక్రాంతికి వచ్చిన సినిమాలు హైలైట్ అనే చెప్పాలి. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్, వెంకటేష్ నటించిన సైంధవ్, నాగర్జున నా సామి రంగ విడుదల అయ్యాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన మహేష్ ‘గుంటూరు కారం’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్ లో హనుమాన్ వసూల్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకూ తెలుగులో సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్నింటిలోనూ హనుమాన్ అత్యధిక వసూల్ రాబట్టిన సినిమాగా నిలిచింది అని మేకర్స్ తెలిపారు.
యాక్షన్ మూవీగా వచ్చిన సైంధవ్ వెంకటేష్‌కి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన నాగార్జున నా సామిరంగ మాత్రం పాజిటివ్ రిజల్ట్‌ని ఇచ్చింది. ఇక తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేదు.
ఇక ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాకి మంచి ఆదరణ లభించింది. సుహాస్, శివానీ హీరోహీరోయిన్‌లు గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
ఫిబ్రవరిలోనే భారీ అంచనాల మథ్య విడుదలైన రవితేజ ‘ఈగల్’ డిజాస్టర్‌గా మిగిలింది. రవితేజ, అనుపమా పరమేశ్వర్ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. టెక్నికల్‌గా బాగున్నా.. పెద్దగా కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి జైలర్ వంటి హిట్ తరువాత వచ్చిన లాల్ సలామ్.. తమిళం మరియు తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం మంచి టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ సాధించలేక పోయింది.
ఫిబ్రవరిలో విడుదలైన ‘ఊరు పేరు భైరవకోన’ సూపర్ హిట్‌గా నిలిచింది. సందీప్ కిషన్- వర్ష బొల్లమ్మ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి మంచి హిట్‌ని ఇచ్చింది ఈ మూవీ. ఈ నెలలో రాజధాని ఫైల్స్, సుందరం మాస్టర్ వంటి తదితర సినిమాలు విడుదలైయ్యాయి. అయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోయ్యాయి.
ఇక మార్చిలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలైంటెన్’ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో వారంలో పలు అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గామీ’ సినిమాకి మంచి టాక్ వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.
భీమా కూడా మార్చి లోనే విడుదలైంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా రొటీన్ కమర్షియల్ మూవీగా నిలిచిపోయింది. ఇక వీటితో పాటు రిలీజ్ అయిన రజాకార్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ హిట్ టాక్ తెచ్చుకుంది.
మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సిద్దు జొన్నల గడ్డ- అనుపమ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా త్వరలోనే 100 కోట్లు గ్రాస్ సాధిస్తుంది అంటున్నారు మేకర్స్.
ఇక మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ ఏడాది ప్రారంభంలో హనుమాన్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ఊరు పేరు భైరవకోన, గామి, టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి హిట్‌ని అందుకున్నాయి. చిన్న హీరోలు నటించిన ఈ సినిమాలు పెద్ద సక్సెస్ అందుకున్నాయి.