Last rites of kaikala satyanarayana are complete
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిగాయి. కైకాల అంతిమ సంస్కారాలను ఆయన పెద్దకొడుకు లక్ష్మీనారాయణ నిర్వహించారు. హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రాజకీయ నేతలు, అభిమానులు కైకాల సత్యనారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకుముందు ఫిల్మ్‌నగర్‌లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు చిరంజీవి, సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కైకాల అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు.