HomeTelugu Trending'ఆర్ఆర్ఆర్' మూవీ కెమెరా.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్..!

‘ఆర్ఆర్ఆర్’ మూవీ కెమెరా.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్..!

12 12ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అది సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా పిక్చరైజేషన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కూడా ఈ ప్రత్యేకత ఉంది. అదే లార్జ్ ఫార్మాట్ కెమెరా. ఇండియాలో ఈ కెమెరాతో చిత్రీకరించబడుతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అందులో అత్యుత్తమమైన సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు. ఈ విషయాన్ని సినిమా డివోపి సెంథిల్ కుమార్ తెలిపారు. మరి ఈ కెమెరా మ్యాజిక్ ఏ రకంగా ఉంటుందో తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే. ఈరోజే రెండవ షెడ్యూల్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరకు ముగుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రాని దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu