పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘భీమ్లా నాయక్’. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. పవన్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.