పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమ్లానాయక్’. సాగర్ కె.చంద్ర డైరెక్షన్‌లో వస్తున్నఈసినిమాలో పవన్ పాత్ర కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ స్పెషల్ సాంగ్ రాసిన విషయం తెలిసిందే. ‘లాలా బీమ్లా’ అంటూ సాగే ఈ పాట.. అరుణ్ కౌండిన్య ఆలపించారు. తమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ‘లాలా భీమ్లా’ పాట డీజే వెర్షన్‌ను విడుదల చేసింది. ‘డీజే సౌండ్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. న్యూ ఇయర్ పార్టీలో సౌండ్ బాక్సులు దద్దరిల్లిపోవడం ఖాయం’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా ‘భీమ్లానాయక్’ సిద్ధమవుతోంది. అహం, ఆత్మగౌరవం మధ్య పోరు ఏవిధంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్.. ‘భీమ్లానాయక్’ అనే పోలీస్ అధికారిగా, రానా.. ‘డేనియల్ శేఖర్’ పాత్రలో కనిపించనున్నారు. పవన్ సరసన నిత్యామేనన్, రానాకు జంటగా సంయుక్త మేనన్ సందడి చేయనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.