HomeTelugu Trending"ఎన్టీఆర్ మహానాయకుడు" సినిమాపై మండిపడ్డ లక్ష్మీపార్వతి

“ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమాపై మండిపడ్డ లక్ష్మీపార్వతి

6 21
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న, మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా ఆయన తనయుడు బాలకృష్ణ..తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ జీవితంపై రూపొందించిన “ఎన్టీఆర్ కథానాయకుడు” మొదటి భాగం సంక్రాంతికి విడుదలై కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేకపోయింది. ఈసినిమాకు ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. కానీ ఈరోజు విడుదలైన రెండో భాగం “ఎన్టీఆర్ మహానాయకుడు” పై అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా “ఎన్టీఆర్ మహానాయకుడు”చిత్రంపై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందించారు.

మహానుభావుడు తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకునే ఎన్టీవోడి జీవితంపై తెరకెక్కిన “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమాను చంద్రబాబు భజన కోసమే తీసినట్టువుందనే అందరూ అంటున్నారు. బాలకృష్ణ అంతకు మించి ఏమీ చేయలేరని లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబుకు బాలకృష్ణ బామ్మర్ది అంతే కాకుండా స్వయాన వియ్యంకుడు కూడా.. పైగా టీడీపీ ఎమ్మెల్యే.. వారిద్దరి మధ్య వైస్రాయ్ ఒప్పందాలు ఉన్నాయని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కాబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా చేసే సాహసం బాలకృష్ణ చేయలేకపోయాడని తెలిపారు. ముందుగా అందరూ ఊహించిందే జరిగింది. ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని తన సినిమాలో బాలకృష్ణ చూపిస్తారనుకోలేదు. తనతో పాటు ఎవ్వరికీ ఆ నమ్మకం కూడా లేదన్నారు. ఇపుడు “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమా అలాగే తీశారని అన్నారు. తనను సినిమాలో చూపిస్తే ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని సైతం చూపించాల్సి వస్తుందని అందుకే తన పాత్ర పెట్టలేదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu