దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోల పరిస్థితుల్లోనూ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గత 15 రోజులుగా కాశ్మీర్‌లోని ఓ లొకేషన్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నారట. కరోనా ప్రభావంతో పెద్ద నిర్మాతలు సైతం షూటింగ్‌లు నిలిపేశారు. లేడీ నిర్మాత స్వప్నాదత్ మాత్రం రిస్క్ చేస్తూ తన టీమ్‌తో కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కీలక సన్నివేశాలను చిత్రీకరణను దగ్గరుండి చూసుకుంటున్నారట. స్వప్నాదత్ ధైర్యానికి సినీ జనాలు మెచ్చుకుంటున్నారట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెకిస్తున్నారు.