సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా షూటింగ్ ముగించేశారు. ఇక సినిమా విడుదల కావడమే ఆలస్యం. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను నిన్న బుధవారం విడుదల చేయగా, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ సినిమా తరువాత రజినీకాంత్ దర్శకుడు శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రారంభం కాబోతున్నది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ అనుకున్నారు. అయితే, ఇందులో ఓ సీనియర్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కాలా, పేట సినిమాల్లో సీనియర్లను తీసుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నారట. దానికోసం కుష్బూను అడిగారని, ఆమెకు రజినీతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రజినీతో కలిసి అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్ సినిమాల్లో నటించింది కుష్బూ.