టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగిన సంగతి తెలిసిందే. తనను ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్‌లో అసభ్యకర, తీవ్ర పదజాలంతో దూషించారని, అత్యాచారం చేస్తామని బెదిరించారని మీరా చోప్రా వాపోయారు. ట్విట్టర్ ద్వారానే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పమని ఆయన అభిమాని కోరాడు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ఆయనెవరో నాకు తెలీదు. నేను ఆయన అభిమానిని కాదు’’ అని పేర్కొందట. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ కన్నా తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని వెల్లడించినట్లు తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు రెచ్చిపోయారు. తీవ్ర పదజాలంతో మీరా చోప్రాపై ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్టు మీరాను బూతులు తిట్టారు. ఆమెను పోర్న్ స్టార్‌గా పోల్చుతూ కామెంట్లు చేశారని, గ్యాంగ్ రేప్ చేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరించారని.. దీనిపై మీరా చోప్రా ట్విట్టర్‌లో పెద్ద ఉద్యమమే లేవదీశారు. ఎన్టీఆర్ దీనిపై స్పందించాలని, ఆయన అభిమానులను అదుపులో పెట్టుకోవాలని ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి మరీ డిమాండ్ చేశారు. మీరా చోప్రాకు చిన్మయి లాంటి కొంత మంది తమ మద్దతు తెలిపారు. అయితే.. కొంతమంది మీరాచోప్రా ప్రవర్తననూ తప్పుబడుతున్నారు. అసలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని కావాలనే మీరా రెచ్చగొట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Jr NTR fans booked for abusing, threatening Meera Chopra
ఇటువంటి టైమ్‌లో సీనియర్ నటి ఖుష్బూ.. ఎన్టీఆర్ అభిమానులకు అండగా నిలిచారు. స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన ఖుష్బూ.. పరోక్షంగా మీరా ప్రవర్తనను తప్పుబట్టారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘‘కొంత మంది ఆడవాళ్లు ఎప్పటికీ మారరు లేదా ఏమీ నేర్చుకోరు. వాళ్లను అలానే ఉండనివ్వండి’’ అని ఖుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆమె పేరు వాడకపోయినా.. ఇది మీరాను ఉద్దేశించేనని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని కామెంట్ల ద్వారా చెబుతున్నారు. ఖుష్బూకి ధన్యవాదాలు చెబుతున్నారు. ఆమె తమకు అండగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Some women never change or learn. Poor them..
— KhushbuSundar ❤️ (@khushsundar) June 3, 2020